Thu Mar 19 2026 10:30:03 GMT+0530 (India Standard Time)
ఆదాల సమక్షంలో పార్టీలో చేరిన రింగ్ రియాజ్
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన రింగ్ రియాజ్ వైసీపీలో చేరారు.

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జనసేన పార్టీకి చెందిన రింగ్ రియాజ్ వైసీపీలో చేరారు. రూరల్ నియోజకవర్గంలోని 30వ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ కు చెందిన జనసేన పార్టీ నేత ప్రముఖ సినీ, టీవీ నటులురింగ్ రియాజ్ జనసేనకు రాజీనామా చేశారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు, రూరల్ ఇన్ఛార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి సమక్షంలో రియాజ్ వైఎస్ఆర్సిపిలో చేరారు.
తన అనుచరులతో కలసి...
శనివారం ఆయన 300 మంది తన అనుచరులతో కలసి జనసేన పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్ఆర్సీపీలో చేరారు. వైఎస్ఆర్సిపిలో చేరేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన రింగ్ రియాజ్ కు వైఎస్ఆర్సిపి జెండా కప్పి ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీలోకిఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై, తనకు మద్దత్తు పలుకుతూ రియాజ్ పార్టీలో చేరారని తెలిపారు.
Next Story

