Tue Mar 17 2026 01:39:28 GMT+0530 (India Standard Time)
టీడీపీ కుట్రలతోనే ఇళ్ల పట్టాలకు ఆటంకం
ఇళ్లపట్టాలు దక్కకుండా టీడీపీ అడ్డుకుంటుందని రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు

ఇళ్లపట్టాలు దక్కకుండా టీడీపీ అడ్డుకుంటుందని రెవెన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఆయన ఈరోజు అసెంబ్లీ సమావేశాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ అంశంపై మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్ కు మంచి పేరు వస్తుందని టీడీపీ కుట్రలు చేస్తుందన్నారు. పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటే న్యాయస్థానాలను ఆశ్రయించి టీడీపీ అడ్డుకుంటుందని చెప్పారు.
ఇచ్చి తీరతాం....
అయితే పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు నాణ్యమైన ఇంటిని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. దీనిపై 221 కోర్టు కేసులు ఉన్నాయన్నారు. 3,21 లక్షల మందికి పట్టాలు ఇవ్వాలనుకున్నామన్నారు. న్యాయ పరంగా సమస్యలను అధిగమించి తమ ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి ధర్మాన తెలిపారు. రాజధాని అమరావతిలోనూ పేద దళితులకు పట్టాలు ఇవ్వాలని అనుకున్నా టీడీపీ అడ్డుకుందని ఆయన ఆరోపించారు.
Next Story

