Wed Mar 18 2026 21:35:05 GMT+0530 (India Standard Time)
నేడు టెన్త్ పరీక్ష ఫలితాలు
నేడు ఏపీ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారు

నేడు ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేస్తారు. కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ లో పదో తరగతి పరీక్షలు నిర్వహించలేకపోయారు. తొలిసారి ప్రభుత్వం ఫలితాలను విడుదల చేస్తుంది.
మార్కులు...
అయితే ఈసారి గ్రేడ్లు పదో తరగతి పరీక్షల్లో ఉండవు. మార్కులే విడుదల చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు మొత్తం 6,21,799 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. త్వరితగతంగా వాల్యుయేషన్ చేసి ఫలితాలను వెల్లడిస్తున్నామని, శనివారం విడుదల చేయాల్సి ఉన్నా సాంకేతిక లోపాల కారణంగా విడుదల చేయలేదని అధికారులు వెల్లడించారు.
Next Story

