Thu Mar 19 2026 12:38:12 GMT+0530 (India Standard Time)
విశాఖలో ఆర్బీఐ రీజనల్ ఆఫీస్
భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ కార్యాలయం విశాఖపట్నంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది

భారతీయ రిజర్వ్ బ్యాంకు ప్రాంతీయ పార్టీ కార్యాలయం విశాఖపట్నంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతుంది. అమరావతిలో ఏర్పాటు చేయాల్సిన కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంప్రదించింది.
అనువైన స్థలం...
ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు విశాఖలో అనువైన స్థలాన్ని తమకు లీజు పద్ధతిన కేటాయించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కోరింది. పదేళ్ల పాటు లీజు పద్ధతిన స్థలాన్ని ఇవ్వాలని కోరింది. ప్రభుత్వం ఈ ప్రతిపాదనకు ముందుకు వస్తే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ కార్యాలయాన్ని విశాఖలో ఏర్పాటు చేయనుంది.
Next Story

