Fri Dec 05 2025 09:14:16 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీకి ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు
ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలెప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు నేటి నుంచి పర్యటించనున్నారు.

ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలెప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు నేటి నుంచి పర్యటించనున్నారు. ప్రపంచబ్యాంకు, ఏషియన్ డెవలలెప్మెంట్ బ్యాంకు ప్రతినిధులు మరోసారి రాష్ట్రానికి వచ్చి అమరావతిలో అధ్యయనం చేయనున్నారు. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి నిధుల విడుదల కోసం ప్రపంచబ్యాంకు, ఏడీబీ బ్యాంకులను ప్రభుత్వం సంప్రదించిన సంగతి తెలిసిందే.
రాజధాని అమరావతిలో...
ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు ఈ నెల 23 నుంచి 27 వరకు రాజధాని అమరావతి ప్రాంతంలో పర్యటించి వివిధ అంశాలపై సీఆర్డీఏ అధికారులతో చర్చించనున్నారు. ప్రాజెక్టు స్వరూపం, మౌలిక వసతులకల్పన, వరద నివారణ, వాతావరణ మార్పులు, భూముల వినియోగం, పేదలకు ఇళ్ల నిర్మాణం,ఉపాధి కల్పన తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిసింది
Next Story

