Fri Dec 05 2025 12:29:33 GMT+0000 (Coordinated Universal Time)
లిక్కర్ కేసు నిందితులను నేడు ఏసీబీ కోర్టుకు
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం కేసు నిందితులకు రిమాండ్ గడువు నేటితో ముగియనుంది. నిందితులను విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు హాజరుపరచనున్నారు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటి వరకూ పన్నెండు మంది నిందితులను స్పెషల్ ఇన్విస్టేగేషన్ అధికారులు అరెస్టు చేసి కోర్టు ముందు పెట్టడంతో వారు రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు.
వివిధ జైళ్లలో ఉన్న...
రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మిధున్ రెడ్డి, గుంటూరు జిల్లా కారాగారంలో రిమాండ్లో ఉన్న బాలాజీకుమార్ యాదవ్, నవీన్ కృష్ణ, తో పాటు విజయవాడలోని జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న రాజ్ కెసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, చాణక్య, దిలీప్, ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప బాలాజీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులను నేడు ఏసీబీ కోర్టులో హాజరు పర్చనున్నారు.
Next Story

