Fri Dec 05 2025 17:40:08 GMT+0000 (Coordinated Universal Time)
నేటితో ఏపీ లిక్కర్ స్కామ్ నిందితుల రిమాండ్ ముగింపు
నేటితో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగియనుంది.

నేటితో ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితుల రిమాండ్ ముగియనుంది. ఈ కేసులో అరెస్టయిన పదకొండు మంది నేడు న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరచనున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీం అధికారులు ప్రాధమికంగా ఛార్జిషీట్ దాఖలు చేశారు. పూర్తి స్థాయి ఛార్జిషీట్ ను దాఖలు చేయలేుద.
కోర్టులో ప్రవేశపెట్టనున్న...
గతంలో రెండు సార్లు నిందితులను వర్చువల్ గా పోలీసులు న్యాయస్థానంలో హాజరుపర్చగా రిమాండ్ గడువు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసులో నిందితులు వేసుకున్న బెయిల్ పిటీషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది. మరి నేడు రిమాండ్ పొడిగించే అవకాశాలున్నాయని న్యాయనిపుణులు చెబుతున్నారు.
Next Story

