Sun Mar 15 2026 16:16:47 GMT+0530 (India Standard Time)
తిరుమలలో ముఖేష్ అంబానీ
రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన టీటీడీకి 1.5 కోట్లు విరాళం ప్రకటించారు

రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ ఈ రోజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన టీటీడీకి 1.5 కోట్లు విరాళం ప్రకటించారు. ఈరోజు తిరుమల చేరుకున్న అంబానీ కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన స్వామి వారి అభిషేక సేవలో పాల్గొన్నారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి , ఎమ్మెల్యే చెవిరెడ్డ భాస్కర్ రెడ్డి కూడా ఆయన వెంట ఉన్నారు. కొడుకు అనంత్ అంబానీ, కాబోయే కోడలు రాధిక తో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు.
గోశాలను దర్శించి....
ఈ సందర్భంగా ముఖేష్ అంబానీకి రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందచేశారు. స్వామి వారి శేష వస్త్రాన్ని ఇచ్చి తీర్థ ప్రసాదాలను అంద చేశారు. అంబానీ కుటుంబం తిరుమలలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. శ్రీవారి ఆలయం ఎదుట గజరాజుకు కూడా అంబానీ మొక్కారు. అనంతరం ఆయన గోశాలకు వెళ్లి అక్కడ గోవులు, వాటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
Next Story

