Thu Mar 19 2026 03:19:33 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : ఏపీలో లబ్దిదారులకు గుడ్ న్యూస్
ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధుల విడుదల మొదలయింది

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలకు సంబంధించి నిధుల విడుదల మొదలయింది. 14,80 కోట్లను ఆసరా పధకం కింద విడుదల చేసింది. విద్యా దీవెన కింద 500 కోట్ల రూపాయల నిధులను విడుదల చేస్తుంది. మిగిలిన పథకాలకు సంబంధించిన నిధులను కూడా ఈరోజు విడుదల చేయనునట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
నిధుల విడుదలకు...
ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులను లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయడానికి వీలులేదని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నెల 13వ తేదీన పోలింగ్ పూర్తయిన తర్వాత 14వ తేదీ నుంచి నిధులను విడుదల చేయవచ్చని పేర్కొంది. దీంతో నిన్నటి నుంచి నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలు పెట్టింది.
Next Story

