Tue Feb 03 2026 20:08:34 GMT+0000 (Coordinated Universal Time)
సాయిరెడ్డి బంధువులంతా సైకిల్ పార్టీలోకే
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బంధువులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి బంధువులు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు సమక్షంలో వారంతా టీడీపీ కండువా కప్పుకున్నారు. మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాధ్ రెడ్డి విజయసాయిరెడ్డి బావమరిది. ఆయనతో పాటు విజయసాయిరెడ్డి కుటుంబ సభ్యులంతా టీడీపీలో చేరిపోయారు.
మాజీ ఎమ్మెల్యే అయిన...
ద్వారకానాధ్ రెడ్డి నియోజకవర్గాల పునర్విజనలో భాగంగా రద్దయిన లక్కిరెడ్డిపల్లెకు శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1994లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. టీడీపీ నుంచే ఆయన నాడు ఎమ్మెల్యే అయ్యారు. తర్వాత విజయసాయిరెడ్డి వైసీపీలో చేరడంతో ఆయన కూడా వైసీపీ లోకి చేరారు. ఇప్పుడు రాయచోటిలో పోటీ చేసేందుకు ఆయన టీడీపీలో చేరినట్లు సమాచారం.
Next Story

