Sat Feb 07 2026 14:15:11 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నిరుద్యోగులకు నిరాశ.. భర్తీ కాని పోస్టులు
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని 518 పోస్టుల భర్తీ ప్రక్రియ గత కొద్ది రోజుల నుంచి అమలు కావడం లేదు

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లోని 518 పోస్టుల భర్తీ ప్రక్రియ గత కొద్ది రోజుల నుంచి అమలు కావడం లేదు. న్యాయపరమైన చిక్కులతో 518 పోస్టులను ఏపీపీఎస్సీ భర్తీ చేయలేకపోతుంది. రిజర్వేషన్లు, విద్యార్హతలతో పాటు న్యాయస్థానంలో కేసులతో ఈ ఉద్యోగాలను భర్తీ చేయడానికి వీలులేకుండా పోయిందని ఏపీపీఎస్సీ అధికారులు తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చి రెండేళ్లవుతున్న ఉద్యోగాలకు కూడా ఇంకా భర్తీ చేయడం లేదని నిరుద్యోగులు వాపోతున్నారు.
రెండేళ్ల నుంచి...
ఇప్పటికే పరీక్షలు రాసిన అభ్యర్థులు తమకు పోస్టింగ్ లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్నారు. ఇందులో డిగ్రీ కళాశాలలో అధ్యాపకులు, పాలిటెక్నిక్, జూనియర్ లెక్చరర్లకు సంబంధించని పోస్టులను ఇంకా భర్తీచేయలేదు. చట్టపరంగా ఉన్న అడ్డంకులను తొలగించాని అభ్యర్థులు కోరుతున్నారు. ఇంకా ఎంతకాలం సమం పడుతుందన్నది కూడా తెలియక అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు.
Next Story

