Sun Dec 08 2024 08:31:05 GMT+0000 (Coordinated Universal Time)
Vijayawada : విజయవాడలో రికార్డు స్థాయి వర్షం
విజయవాడలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ముప్ఫయి ఏళ్ల రికార్డ్ను బద్దలు చేసింది.
విజయవాడలో రికార్డ్ స్థాయిలో వర్షం కురిసింది. ముప్ఫయి ఏళ్ల రికార్డ్ను బద్దలు చేసింది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకేరోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదు కాలేదని ప్రజలు చెబుతున్నారు. గత రెండు రోజులు విజయవాడలో కుండపోత. అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర వరద నీరు నిలిచిపోయింది.
నిత్యావసరాల కోసం...
ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్ వరకు రోడ్లపైనే నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మంచినీరు దొరకడం కూడా కష్టంగా ఉంది. పాల ప్యాకెట్లు కూడా లభించడం లేదు. వ్యాపారులు దుకాణాలు తెరవకపోవడంతో ప్రజలు నిత్యావసరాల కోసం ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో గతంలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని స్థానికులు చెబుతున్నారు.
Next Story