Sat Jan 24 2026 04:59:42 GMT+0000 (Coordinated Universal Time)
నెల్లూరు రూరల్లో రికార్డుస్థాయిలో అభివృద్ధి పనులు
నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు

నెల్లూరు రూరల్లో రికార్డు స్థాయిలో అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. ఈరోజు ఒకేరోజు 340 పనులకు శంకుస్థాపన పనులు చేయనున్నారు. గతంలో రికార్డు స్థాయిలో 339 పనులు చేపట్టి 60 రోజుల్లో పూర్తి చేసిన ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నేడు ఆ రికార్డును బ్రేక్ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు కూడా పాల్గొననున్నారు.
కేవలం రెండు నెలల్లో...
కేవలం ఈ పనులను కూడా రికార్డు స్థాయిలో పూర్తి చేయాలని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి భావిస్తున్నారు. ఇందుకోసం అధికారులతో పాటు అవసరమైన సిబ్బందికి కూడా ఆదేశాలు జారీ చేశారు. ఈ పనులను కూడా రెండు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించిన నిధులను కూడా విడుదలకు సిద్ధం చేశారు.
Next Story

