Thu Jan 29 2026 05:33:26 GMT+0000 (Coordinated Universal Time)
జనసేన కార్యాలయంపై డ్రోన్.. డ్రోన్ వారిదే
మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంపై ఇటీవల డ్రోన్ ఎగరడం కలకలం రేపింది

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ క్యాంప్ కార్యాలయంపై ఇటీవల డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. పవన్ కల్యాణ్ భద్రతపై అనేక అనుమానాలు పెరిగాయి. దీంతో జనసేన నేతలు పవన్ కల్యాణ్ భద్రతను మరింత పెంచాలంటూ డిమాండ్ చేశారు. డీజీపీకి కూడా ఫిర్యాదు చేశారు. వెంటనే డీజీపీ దీనిపై విచారణకు ఆదేశించారు.
పోలీసులు గుర్తించి...
జనసేన కార్యాలయంపై ఎగిరిన డ్రోన్‌ను పోలీసులు గుర్తించారు. అది ఏపీ ఫైబర్ నెట్ సంస్థదిగా తేల్చారు. అది ప్రభుత్వానిదేనని చివరకు తేల్చారు. ట్రాఫిక్, పారిశుద్ధ్య కాల్వల నిర్వహణ, రహదారుల స్థితిగతులపై ప్రభుత్వం అధ్యయనం చేపడుతోందని, అందులో భాగంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా మంగళగిరిలో అధ్యయనం చేయడానికి మంగళగిరిలో టీడీపీ, జనసేన కార్యాలయాలపై డ్రోన్ ఎగిరినట్లు పోలీసులు గుర్తించారు.
Next Story

