Sat Mar 07 2026 23:18:34 GMT+0530 (India Standard Time)
వైసీపీ ఎమ్మెల్యేను ఆయన కొట్టారు
వైసీపీ ఎమ్మెల్యేపై ఒక ప్రభుత్వంలోని పెద్ద చేయిచేసుకున్నారని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు

వైసీపీ ఎమ్మెల్యేపై ఒక ప్రభుత్వంలోని పెద్ద చేయిచేసుకున్నారని రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. ఎమ్మెల్యేను కొట్టిన సమాచారం తన వద్ద ఉందన్నారు. త్వరలోనే అది బయటకు వస్తుందని చెప్పారు. ఒక ఎంపీ, ఎమ్మెల్యే మధ్య జరగిన వివాదంలోనే ఆ పెద్ద ఎమ్మెల్యేపై చేయిచేసుకున్నారని రఘురామ కృష్ణరాజు తెలిపారు. వైసీపీలో ఆధిపత్యపోరు మొదలయిందని ఆయన తెలిపారు.
పవన్ ను ఇబ్బంది పెట్టడానికే....
పవన్ కల్యాణ్ ను ఇబ్బంది పెట్టేందుకే సినిమా టిక్కెట్ల ధరలను తమ ప్రభుతత్వం తగ్గించిందని రఘురామ కృష్ణరాజు తెలిపారు. సినిమా టిక్కెట్ల రేట్లను తగ్గించినందున పవన్ కు ఎలాంటి నష్టం జరగదన్నారు. తాను సొంత పార్టీని చక్కదిద్దే పనిలో ఉన్నానని, ఆ తర్వాతనే పార్టీ మార్పు ఆలోచన చేస్తానని రఘురామ కృష్ణరాజు తెలిపారు.
Next Story

