Sun Mar 08 2026 00:33:44 GMT+0530 (India Standard Time)
అందరూ అమరావతినే కోరుకుంటున్నారు
వైసీపీప్రభుత్వం పై ఎంపీ రఘురామ కృష్ణరాజు మండి పడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.

వైసీపీ ప్రభుత్వం పై ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు మండి పడ్డారు. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మూడు రాజధానులను ఎవరూ స్వాగతించడం లేదని రఘురామ కృష్ణరాజు తెలిపారు. రాయలసీమ వారు కూడా అమరావతిని రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నారని, విశాఖలో రాజధాని పెట్టి ఆస్తులు కొట్టేయాలని చూస్తున్నారన్న ఆరోపణలు విన్పిస్తున్నాయన్నారు.
అవమానించడం సరికాదు...
రాజధాని అమరావతి రైతులను అవమానించడం సరికాదని రఘురామ కృష్ణరాజు మీడియా సమావేశంలో చెప్పారు. రాయలసీమకు జగన్ ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. రాజధానిని అమరావతిలోనే ఉంచి మిగిలిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తే ఎవరు కాదంటారు అని ప్రశ్నించారు. అభివృద్ధి చేయడానికి డబ్బులు లేకనే ఈ మూడు ముక్కలాట డ్రామాలు ఆడుతున్నారని రఘురామ కృష్ణరాజు ధ్వజమెత్తారు.
Next Story

