Mon Mar 16 2026 05:49:53 GMT+0530 (India Standard Time)
ఏపీలో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ బదిలీలు?
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ లకు రంగం సిద్దం మయిందని తెలిసింది

ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్, ఐపీఎస్ ల బదిలీ లకు రంగం సిద్దం మయిందని తెలిసింది. ఈరోజో, రేపో అధికారిక ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్నికలు వచ్చే ఏడాది జరుగుతుండటంతో ముందుగానే ఐపీఎస్, ఐఏఎస్ అధికారుల బదిలీలు చేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించినట్లు సమాచారం.
నేడో, రేపో ఉత్తర్వులు...
ఇప్పటికే జిల్లా కలెక్టర్లు, ఎస్పీల బదిలీ ప్రక్రియ పూర్తయినట్లు చెబుతున్నారు. కొందరు కలెక్టర్ల, ఎస్పీలపై స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు ఎమ్మెల్యేలు కూడా ఫిర్యాదు చేయడంతో వారిని బదిలీ చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. నిజానికి గత నెలలోనే బదిలీ జరగాల్సి ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జగన్ ఆమోదం కాకపోవడం, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో బదిలీలు చేయడం జరగలేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడంచాయి.
Next Story

