Sun Mar 15 2026 16:05:56 GMT+0530 (India Standard Time)
నేడు రాయలసీమ గర్జన సభ
కర్నూలులో నేడు రాయలసీమ గర్జన సభ జరగనుంది. కర్నూలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు

కర్నూలులో నేడు రాయలసీమ గర్జన సభ జరగనుంది. కర్నూలు సభకు భారీ ఏర్పాట్లు చేశారు. వైసీపీ మద్దతు ఈ గర్జన సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు లక్ష మంది హాజరవుతారని అంచనా. రాయలసీమలోని నాలుగు జిల్లాల నుంచి సభకు ప్రజలు హాజరు కానున్నారు.
వైసీపీ మద్దతుతో...
కర్నూలుకు న్యాయ రాజధానిని కేటాయించాలంటూ ఈ సభను నిర్వహించనున్నారు. ఎస్టీబీసీ కళాశాల మైదానంలో ఈ సభను నిర్వహిస్తున్నారు. రాయలసీమ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సభకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

