Thu Jan 29 2026 16:30:22 GMT+0000 (Coordinated Universal Time)
మేం కూడా మహాపాదయాత్రకు సిద్ధం
అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుతూ తాము కూడా మహా పాదాయత్ర చేస్తామని రాయలసీమ సమన్వయ వేదిక ప్రకటించింది

అన్ని ప్రాంతాలకు న్యాయం చేయాలని కోరుతూ తాము కూడా మహా పాదాయత్ర చేస్తామని రాయలసీమ అభివృద్ధి సంఘాల సమన్వయ వేదిక ప్రకటించింది. ఈ సందర్భంగా పలువురు రాయలసీమ మేధావులు, వివిధ ప్రజాసంఘాల నాయకులు మాట్లాడారు. తిరుపతిలో ఈ ప్రజారాజధానుల సభ జరుగుతోంది. ఈ సభలో రాయలసీమ అధ్యయన సంస్థ అధ్యక్షుడు భూమన్ మాట్లాడుతూ స్వార్థ ప్రయోజనాల కోసమే టీడీపీ అమరావతి నినాదం అందుకుందని అన్నారు.
మూడు ప్రాంతాలకు....
అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలంటే ఉత్తరాంధ్ర, రాయలసీమలో రాజధానులు ఉండాల్సిందేనన్నారు. ప్రభుత్వం ప్రకటించిన మూడు రాజధానుల విధానానికి తమ మద్దతు ఉంటుందని వారు చెప్పారు. మూడు రాజధానులకు మద్దతుగా రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు చెప్పారు. అలాగే వికేంద్రీకరణ సాధన కోసం మహాపాదయాత్ర చేస్తామని ప్రకటించారు.
Next Story

