Mon Mar 16 2026 00:32:25 GMT+0530 (India Standard Time)
మరికాసేపట్లో పిఠాపురానికి రామ్ చరణ్
పిఠాపురంలో నేడు రామ్ చరణ్ ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ కూడా రానున్నారు.

పిఠాపురంలో నేడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రచారం చేయనున్నారు. ఆయనతో పాటు చిరంజీవి సతీమణి సురేఖ, అల్లు అరవింద్ కూడా రానున్నారు. పిఠాపురంలో జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు మద్దతుగా వీరు ఈరోజు ప్రచారం చేయనున్నారు. పవన్ కల్యాణ్ ను గెలిపించాలని వీరు కోరనున్నారు.
ప్రచారం నిర్వహించనున్న...
తొలిసారి చిరంజీవి కుటుంబ సభ్యులు పవన్ కల్యాణ్ కోసం ఎన్నికల ప్రచారానికి పిఠాపురం వస్తుండటంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశముందని భావించిన పోలీసులు అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ముగ్గురు రాజమండ్రి ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా పిఠాపురం లోని కుక్కుటేశ్వర స్వామి వారి దేవాలయం సందర్శించనున్నారు. తర్వాత ప్రచారంలో పాల్గొననున్నారు.
Next Story

