Fri Dec 05 2025 22:19:19 GMT+0000 (Coordinated Universal Time)
చంద్రబాబు మళ్లీ బోరున ఏడవాల్సిందే
వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.

వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఎనిమిదివేల స్కూళ్లు మూసివేస్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక్క పాఠశాలను కూడా మూసివేయడం లేదన్నారు. చంద్రబాబు కనీసం అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారన్నారు. చంద్రబాబువి చెప్పేవన్నీ అబద్ధాలేనని అన్నారు. టీడీపీ హయాంలోనే కొత్త డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని మీడియా సమావేశంలో విజయసాయిరెడ్డి తెలిపారు. దేశంలోనే సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఏపీ ముందుందన్నారు. ప్లీనరీ జరిగిన తర్వాత చంద్రబాబు మళ్లీ బోరున విలపించక తప్పదని విజయసాయిరెడ్డి అన్నారు.
దుష్ప్రచారం చేస్తూ...
చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలను ఏ మేరకు అమలు చేశారో గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. ఒక్క హమీని కూడా చంద్రబాబు అమలు పర్చకుండా తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. ఎక్కడా ఇబ్బందులు లేకుండా వైసీపీ ప్లీనరీకి అన్ని ఏర్పాట్లు చేశామని చెప్పారు. రెండు రోజుల్లో నాలుగు లక్షలకు పైగా ప్రతినిధులు హాజరవుతారని, చంద్రబాబు చెప్పినట్లు డ్వాక్రా మహిళలు తమ ప్లీనరీకి రారని, కార్యకర్తలు, నేతలే వస్తారని విజయసాయిరెడ్డి తెలిపారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్లీనరీలో వివరిస్తామని ఆయన తెలిపారు.
Next Story

