Tue Jan 14 2025 20:31:25 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : వాళ్లలా మాయం చేయమంటూ...ఈరోజు విజయసాయి రెడ్డి ట్వీట్
టీడీపీలా ఎన్నికలయ్యాక మేనిఫెస్టోను మాయం చేసి ప్రజలను వంచించే వాళ్ళం కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు.
తెలుగుదేశం పార్టీ తరహాలో ఎన్నికలు అయ్యాక తమ పార్టీమేనిఫెస్టోను మాయం చేసి ప్రజలను వంచించే వాళ్ళం కాదని రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. ఆయన ఎక్స్ లో ఈ మేరకు ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, ఒక బైబిల్ అని ఆయన అన్నారు.
మేనిఫెస్టోను...
తమ పార్టీ అధినేత చిత్తశుద్ధి, మా హామీలు, ప్రజల పట్ల మా బాధ్యతకు మేనిఫెస్టో ఓ దివిటీ వంటిదని విజయసాయిరెడ్డి ట్వీట్ లో పేర్కొన్నారు. మేనిఫెస్టోలో ఏం హామీలు ఇచ్చినా వాటిని నూటికి నూరు శాతం అమలు చేసి తీరుతామని విజయసాయి రెడ్డి చెప్పుకొచ్చారు. కాగా వైసీీపీ మ్యానిఫేస్టో ఇంకా విడుదల కావాల్సి ఉంది.
Next Story