Sun Mar 15 2026 11:55:57 GMT+0530 (India Standard Time)
స్కూబా డైవింగ్... చేసిన విజయసాయిరెడ్డి
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండమాన్ నికోబార్ దీవుల్లో గడుపుతున్నారు.

వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అండమాన్ నికోబార్ దీవుల్లో గడుపుతున్నారు. పార్లమెంటు సమావేశాలు ముగియడంతో ఆయన అండమాన్ నికోబార్ దీవులకు వెళ్లి కొంచెం స్ట్రెస్ ఫ్రీ అవుతున్నారు. అండమాన్ సముద్రంలో ఆయన కాలం వెళ్లబుచ్చుతున్నారు. అక్కడ పారాసైలింగ్ కూడా చేశారు.
అండమాన్ సముద్రంలో....
ఆయన అండమాన్ సముద్రంలోకి 12 మీటర్ల లోతుకు వెళ్లి స్కూబా డైవింగ్ చేశారు. ఈనెల 6వ తేదీన స్కూబా డైవింగ్ చేసినట్లు విజయసాయిరెడ్డి తన ట్విట్టర్ లో తెలిపారు. ఇలాంటి అనుభవాన్ని ఎన్నడూ చూడలేదని విజయసాయిరెడ్డి ట్విట్టర్ లో తెలిపారు. సముద్రం లోతుల్లో మ్యాజిక్ ను చూసి థ్రిల్లింగ్ కు గురయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు.
Next Story

