Sun Mar 15 2026 11:55:57 GMT+0530 (India Standard Time)
బిత్తిరి మాటలు ఎందుకు బాబూ?
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. బాబు లవ్ మ్యాటర్ పై ఛలోక్తులు విసిరారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సెటైర్ వేశారు. చంద్రబాబు లవ్ మ్యాటర్ పై ఛలోక్తులు విసిరారు. రాజకీయ పార్టీల మధ్య పొత్తును చంద్రబాబు లవ్ ఎఫైర్ స్థాయికి దిగజార్చారని ఆయన అన్నారు. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకుంటున్న చంద్రబాబు వన్ సైడ్, టూ సైడ్ లవ్ అంటూ బిత్తిరి మాటలు మాట్లాడుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు.
రోడ్డు సైడ్ రోమియోలా....
రోడ్డు సైడ్ రోమియోలా వెంటపడినా చంద్రబాబుకు ఏ సైడ్ నుంచి లవ్ దొరకదంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. చంద్రబాబు ను లవ్ చేసేది పచ్చకుల మీడియా, ఆయన బినామేలంటూ విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.
Next Story

