Fri Dec 05 2025 21:50:49 GMT+0000 (Coordinated Universal Time)
రాజ్యసభలో కనకమేడల ఘాటు విమర్శలు.. అడ్డుకున్న వైసీపీ
ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

ఆంధ్రప్రదేశ్ లో డ్రగ్స్ మాఫియా రాజ్యమేలుతుందని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. డ్రగ్స్ కు అడ్డాగా ఏపీ మారిందని ఆరోపించారు. డ్రగ్స్ తో పాటు క్యాసినోలను కూడా ప్రభుత్వం నడిపిస్తుందని కనకమేడల ప్రస్తావించారు. గుడివాడలో జరిగిన క్యాసినోను ఆయన ఉదహరించారు. ప్రభుత్వం పోలీసుల సహకారంతో ఈ వ్యవహారాలను నడుతుపుతుందని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.
అడ్డుకున్న వైసీపీ.....
అలాగే ప్రతిపక్ష పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ప్రభుత్వం దిగుతుందన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ కార్యాలయాలపై దాడులు చేశారన్నారు. పోలీసుల ముందే దాడులు జరిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఆలస్యం జరుగుతుందన్నారు. పారిశ్రామికవేత్తలు ఏపీకి వచ్చేందుకు భయపడిపోతున్నారన్నారు. ఏపీలో ఈ మూడేళ్లలో కొత్త పెట్టుబడులు రాలేదన్నారు. అయితే కనకమేడల రవీంద్ర కుమార్ ప్రసంగాన్ని వైసీపీ సభ్యులు అడ్డుకున్నారు.
Next Story

