Thu Mar 19 2026 08:50:51 GMT+0530 (India Standard Time)
జగన్ నోరు విప్పాల్సిందే
బీజేపీ నేతలను అరెస్ట్ పై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జగన్ బాధ్యత వహించాలన్నారు

ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ నేతలను అరెస్ట్ పై రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి జగన్ బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బీజేపీ నేతలు శాంతియుతంగా సంక్రాంతి ముగింపు సంబరాలకు వెళ్తుంటే ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందని జీవీఎల్ అన్నారు. పోలీసులు నిబంధనలను తుంగలో తొక్కి అక్రమ అరెస్ట్ లు చేశారన్నారు. పోలీసులు వారిని అరెస్ట్ చేసి అనేక స్టేషన్లను తిప్పారన్నారు.
వారిని ఏం చేయలేక.....
అలజడులు సృష్టిస్తున్న వారిని ఏం చేయలేని ప్రభుత్వం, తమ పార్టీ నేతలను అరెస్ట్ చేసిందన్నారు. ఎందుకు గుడివాడకు వెళ్లకుండా అడ్డుకుందో చెప్పాలని కూడా జీవీఎల్ నరసింహారావు నిలదీశారు. తమ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఆయన ఆరోపించారు. వైసీపీ నేతలకు ముగ్గుల పోటీలు పెట్టడం రాదని, మూడు ముక్కలాట మాత్రం వచ్చని జీవీఎల్ నరసింహారావు ఎద్దేవా చేశారు.
Next Story

