Fri Dec 05 2025 13:47:22 GMT+0000 (Coordinated Universal Time)
ఆ రెండూ రాష్ట్రాన్ని నాశనం చేశాయ్
వైసీపీ, టీడీపీ కలసి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా నాశనం చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు.

వైసీపీ, టీడీపీ కలసి ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా నాశనం చేశాయని బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వాడుకుంటూ పథకాలకు తమ స్టిక్కర్లను రెండు పార్టీలూ తాము అధికారంలో ఉండగా వాడుకున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో మిగిలిన రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్ కే ఎక్కువ నిధులు కేటాయించిందని, దీనిపై తాము ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు సిద్ధమని జీవీఎల్ నరసింహారావు సవాల్ విసిరారు. ప్రకాశం జిల్లాలో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడారు.
కేంద్రం ఇచ్చిన నిధులతోనే....
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతో పథకాలకు తమ పేర్లు పెట్టుకుని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం వైసీపీ ప్రభుత్వం చేస్తుందని జీవీఎల్ నరసింహారావు దుయ్యబట్టారు. కరోనా సమయంలోనూ పేదలకు ఉచిత బియ్యాన్ని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఆరేళ్లలో 24 వేల కోట్లు ఆహార సబ్సిడీ కింద ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు.
Next Story

