Fri Dec 05 2025 13:48:50 GMT+0000 (Coordinated Universal Time)
సీఎం అభ్యర్థి ప్రకటన అప్పుడే
జేపీ నడ్డా పర్యటనలో సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు

జేపీ నడ్డా పర్యటనలో సీఎం అభ్యర్థి ప్రకటన ఉండదని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఆ అంశం ఇప్పుడు కాదని, కేంద్రం పెద్దలు తేలుస్తారని చెప్పారు. ఏపీ పై బీజేపీ ఫోకస్ పెట్టిందన్నారు. అందుకోసమే జేపీ నడ్డా రెండు రోజుల సమయాన్ని ఏపీకి కేటాయించారన్నారు. జనసేనతో తమ పార్టీ పొత్తు కొనసాగుతుందని చెప్పారు.
ఎనిమిదేళ్ల నుంచి....
జేపీ నడ్డా పర్యటనలో గత ఎనిమిదేళ్ల నుంచి వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు రాష్ట్ర అభివృద్ధిని విస్మరించిన తీరును ఎండగడతారన్నారు. కుటుంబ రాజకీయ పార్టీలకు తాము వ్యతిరేకమన్నారు. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ లు తమకు మద్దతిస్తాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రధానంగా జేపీ నడ్డా ప్రసంగిస్తారని, సీఎం అభ్యర్థి ఎవరన్నది కేంద్ర ప్రభుత్వ పెద్దలు తేల్చాల్సి ఉందన్నారు.
Next Story

