Sun Feb 01 2026 04:31:25 GMT+0000 (Coordinated Universal Time)
వాళ్ల వల్లనే ఏపీకి నష్టం ఎక్కువ
ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ను అన్ని రకాలుగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. హోదా తో సంబంధం లేకుండా వేల కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అదనపు నిధులను కావాలని కోరడంలో ఎలాంటి తప్పు లేదని, తమ ప్రభుత్వం సాయం చేయడానికి ఖచ్చితంగా ముందుకు వస్తుందని జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
రాజధాని అంశం....
అయితే కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీల వల్లనే ఆంధ్రప్రదేశ్ కు ఎక్కువగా నష్టం జరుగుతుందని ఆయన చెప్పారు. రాజధానికి సంబంధించిన అంశం కేంద్రం పరిధిలో లేదని, అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని అంశమని జీవీఎల్ నరసింహారావు చెప్పారు. కేంద్రం నిధులతోనే ఏపీ అభివృద్ధఇ జరుగుతందని చెప్పారు. కేంద్రం ప్రత్యేకంగా ఏపీకి చేయలేదనడం తప్పు అని ఆయన అభిప్రాయపడ్డారు. రెవెన్యూ డెఫిసిట్ గ్రాంట్ ఇస్తున్నామని చెప్పారు. ప్రత్యేక హోదా పేరుతో వచ్చే నిధులు వేరే పేరుతో వస్తున్నాయని చెప్పారు.
Next Story

