Thu Mar 19 2026 01:41:36 GMT+0530 (India Standard Time)
సీమకు జగన్ చేసింది ఏదైనా ఉందా?
ఈ మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు

ఈ మూడున్నరేళ్లలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ చేసిన అభివృద్ధి శూన్యమని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. రాయలసీమలో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టును కూడా జగన్ పూర్తి చేయలేదన్నారు. రాయలసీమ ప్రాంత ప్రజల పట్ల జగన్ కు ఉన్న నిర్లక్ష్యమేంటో అర్ధమవుతుందని తెలిపారు. ప్రజాపోరు యాత్ర ద్వారా వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడతామని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. రాయలసీమ ప్రాంతం నుంచి ఎక్కువ మంది ముఖ్యమంత్రులు అయనా ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ కూడా వైఫల్యం చెందిందని తెలిపారు.
మాఫియా రాజ్యమే....
రాయలసీమలో కియా మినహా మరే పరిశ్రమ రాలేదన్నారు. దీంతో నిరుద్యోగం రోజురోజుకూ పెరిగిపోతుందన్నారు. ఏపీలో ల్యాండ్, మైనింగ్, శాండ్ మాఫియా రాజ్యం నడుస్తుందని జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. కుటుంబ పార్టీలతో అభివృద్ధి సాధ్యం కాదని ఆయన అన్నారు. తాము రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పోరు యాత్రను నిర్వహించి గత, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని తెలిపారు.
Next Story

