Mon Dec 15 2025 08:25:57 GMT+0000 (Coordinated Universal Time)
కేశినేనికి.. సీఎం రమేష్ చురకలు
విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు

విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని నానికి రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. తనపై అసందర్భంగా, సత్యదూరమైన ఆరోపణలు, కల్పితాలు ప్రచారం చేయడం మానాలని సీఎం రమేష్ ట్వీట్ చేశారు. తనపై ప్రచారాన్ని మానుకుని వారి కుటుంబ వ్యవహారాలు, వారి పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మీద దృష్టి పెడితే మంచిదని సీఎం రమేష్ సూచించారు.
పని చూసుకోవాలని....
ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు కానీ, ఆధారాలు కానీ అవసరం లేదని సీఎం రమేష్ ట్వీట్ చేశారు. రెండు రోజుల క్రితం సీఎం రమేష్ పై కేశినేని నాని ఆఫ్ ది రికార్డులో విలేకర్లతో వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ యాభై మంది ఎమ్మెల్యేలు గెలిచినా సీఎం రమేష్ బీజేపీలోకి తీసుకెళతారని, ఆయన ఏపీ ఏక్నాథ్ షిండే అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో సీఎం రమేష్ కేశినేని నానికి పరోక్షంగా చురకలు అంటించారు.
Next Story

