Fri Mar 20 2026 03:01:27 GMT+0530 (India Standard Time)
రాజధాని ఎక్స్ప్రెస్కు తప్పిన ప్రమాదం
రాజధాని ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. పొగలు రావడంతో రైలును లోకో పైలట్ నిలిపేశారు.

రాజధాని ఎక్స్ప్రెస్ కు పెద్ద ప్రమాదం తప్పింది. పొగలు రావడంతో రైలును లోకో పైలట్ నిలిపేశారు. రైలు చక్రాల నుంచి రాపిడి ఏర్పడడం దట్టమైన పొగలు వచ్చాయి. దీంతో లోకో పైలట్ అప్రమత్తమయ్యాడు. వెంటనే లోకో పైలట్ కావలి రైల్వేస్టేషన్లో హుటాహుటిన రైలు ఆపడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.
ప్రయాణికులు...
పైలట్ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. అర్థగంట తరువాత స్వల్ప మరమ్మతుల అనంతరం రాజధాని ఎక్స్ప్రెస్ రైలు బయలుదేరింది. నిజాముద్దీన్ నుంచి చెన్నైకి వెళ్తుండగా కావలి సమీపంలో ఘటన జరిగింది. ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Next Story

