Wed Dec 17 2025 12:54:35 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతిలో మిధున్ రెడ్డి హౌస్ అరెస్ట్
తిరుపతిలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు

తిరుపతిలో రాజంపేట పార్లమెంటు సభ్యుడు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు. పుంగనూరుకు వెళ్లేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేసినట్లు ప్రకటించారు. పుంగనూరు మున్సిపాలిటీలో దాదాపు పదిహేను మంది వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరుతుండటంతో కార్యకర్తలతో సమావేశమయ్యేందుకు మిధున్ రెడ్డి పుంగనూరుకు బయలుదేరారు.
మున్సిపల్ కార్పొరేటర్లు...
అయితే పుంగనూరుకు మిధున్ రెడ్డి వెళితే శాంతి భధ్రతలు అదుపు తప్పుతాయని భావించిన పోలీసులు మిధున్ రెడ్డిని పుంగనూరుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. పుంగనూరు మున్సిపాలిటీలో గత ప్రభుత్వ హాయాంలో ఏకగ్రీవమైన మున్సిపాలిటీని టీడీపీ తన సొంతం చేసుకునేందుకు సిద్ధమయింది. ఈనేపథ్యంలో పుంగనూరుకు వెళ్లనున్న ఎంపీ మిధున్ రెడ్డిని పోలీసులు అక్కడకు వెళ్లకుండా అడ్డుకున్నారు.
Next Story

