Thu Dec 18 2025 17:51:51 GMT+0000 (Coordinated Universal Time)
Chandrababu Bail : జైలు సిబ్బందికి గ్రేట్ రిలీఫ్
టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో జైలు అధికారులు, సిబ్బంది రిలీఫ్ ఫీలవుతున్నారు

టీడీపీ అధినేత చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ రావడంతో జైలు అధికారులు, సిబ్బంది రిలీఫ్ ఫీలవుతున్నారు. వీవీఐపీ కావడంతో ఆయనకు జైలులో భద్రత కల్పించడం, నిత్యం ఆయనకు బయట నుంచి తెస్తున్న ఆహారాన్ని, మందులను పరీక్షించడంతో పాటు ఆయనకు ఏ ఇబ్బంది జరగకుండా చూసేందుకు జైలు సిబ్బంది గత యాభై రెండు రోజుల నుంచి టెన్షన్ పడుతున్నారు. 73 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును కంటికి రెప్పలా కాపాడుకోవడానికి జైలు సిబ్బంది, అధికారులు అన్ని ప్రయత్నాలు చేశామని చెబుతున్నారు. తమకు కోర్డు ఆర్డర్ అందిన తర్వాత ప్రొసీజర్ ప్రకారం నిర్ణయం తీసుకుంటామని జైలు అధికారులు చెబుతున్నారు.
రెండు నెలల నుంచి...
అయినా తమపై ఏదో ఒక అపవాదుపడుతూనే వేస్తూనే ఉన్నారని వారు అంటున్నారు. ఇతర ఖైదీల కంటే చంద్రబాబును ఇరవై నాలుగు గంటలూ పరిశీలిస్తూ ఆయన ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకుంటూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని జైలు అధికారులు చెబుతున్నారు. దాదాపు రెండు నెలల నుంచి చంద్రబాబు జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో జైలులో ఉన్న సిబ్బంది స్నేహ బరాక్ వద్ద ఏ చిన్న అలికిడి జరిగినా వెంటనే అటెండ్ అవుతున్నామని చెబుతున్నారు. దీంతో పాటు రోజూ ములాఖత్ లతో కూడా తమకు ఇబ్బంది ఎదురవుతుందని వారు వాపోతున్నారు. ఇప్పుడు నాలుగు వారాల పాటు బెయిల్ పై బయటకు వెళుతుండటంతో వారంతా కొంత రిలీఫ్ ఫీలవుతున్నారని అనుకోవచ్చు.
Next Story

