Mon Mar 16 2026 18:38:01 GMT+0530 (India Standard Time)
వంద పనుల్లో ఆ ఒక్కటే మంచి పని
రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని హర్షించారు

తెలుగుదేశం పార్టీ నేతలు జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నారు. తాజాగా రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడాన్ని హర్షించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. గత రెండున్నరేళ్లుగా వంద పనులు చేసిన జగన్ ప్రభుత్వం అందులో 99 తప్పులు చేసిందని అన్నారు. అందులో ఒకటి మాత్రం మంచిపని అని, మిగిలినవన్నీ ప్రజలను ఇబ్బంది పెట్టేవేనని ఆయన అన్నారు.
ఈ రెండున్నరేళ్లలో....
ఈ రెండున్నరేళ్లలో ఇసుక నుంచి అన్నీ ధరలు పెరిగి పేద, మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచేశారన్నారు. ప్రత్యేక హోదా కోసం కనీస ప్రయత్నం చేయడం లేదని చెప్పారు. అయినా ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టి జగన్ ఒకే ఒక మంచి పనిచేశారని గోరంట్ల బుచ్చయ్య చౌదరి కితాబిచ్చారు.
Next Story

