Sun Mar 15 2026 14:04:51 GMT+0530 (India Standard Time)
యువకుడిని కాపాడిన వైసీపీ ఎంపీ
రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక యువకుడిని కాపాడారు.

రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మార్గాని భరత్ ఆత్మహత్య చేసుకోబోతున్న ఒక యువకుడిని కాపాడారు. రాజమండ్రి - కొవ్వూరు రైల్వే కం రోడ్డు వంతెనపై ఈ ఘటన జరిగింది. నిడదవోలు మండలం ఉనకరమిల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప అనే యువకుడు ఇంజినీరింగ్ పూర్తి చేసి మూడేళ్ల నుంచి ఉద్యోగం కూడా చేస్తున్నాడు. అయితే అతను ఆత్మహత్య చేసుకోవడానికి బైకు పైన వంతెనపైకి వచ్చాడు.
గోదారిలో దూకుతుండగా...
వంతెనపై బైక్ ఆపి గోదావరిలోకి దూకేందుకు అయ్యప్ప సిద్ధమయ్యాడు. అయితే సరిగ్గా అదే సమయంలో రాజమండ్రి ఎంపీ భరత్ అటు వైపు వెళుతూ చూశాడు. వెంటనే ఎంపీ భరత్ కారులో నుంచి ఒక్క ఉదుటన దూకి ఆ యువకుడి కాలర్ ను పట్టుకుని ఆపారు. ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడని ఆరా తీశారు. అయితే సరైన సమాధానం చెప్పకపోవడంతో వెంటనే పోలీసులను రప్పించి తన అనుచరులను కొంతమందిని ఆ యువకుడి ఇంటికి పంపారు. మార్గాని భరత్ యువకుడిని కాపాడిన తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Next Story

