Fri Dec 05 2025 17:52:33 GMT+0000 (Coordinated Universal Time)
ఢిల్లీకి పురంద్రీశ్వరి.. అన్ని విషయాలపై క్లారిటీ
రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంద్రీశ్వరి నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు

రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంద్రీశ్వరి నేడు ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. పార్టీ పెద్దలతో ఆమె సమావేశం కానున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో పార్టీ అద్భుతమైన విజయం సాధించడంతో పాటు ఏపీ కూటమిలో ప్రధానంగా మారడం వల్ల కూడా పురంద్రీశ్వరికి పార్టీలో అధిక ప్రాధాన్యత దక్కినట్లయింది.
పెద్దలను కలసి...
దీంతో ఆమె పార్టీ పెద్దలను కలసి విజయానికి గల కారణాలను పార్టీ పెద్దలకు వివరించనున్నారు. దీంతో పాటు త్వరలో జరగబోయే కేంద్ర, రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై కూడా పార్టీ పెద్దలతో పురంద్రీశ్వరి చర్చించనున్నట్లు తెలిసింది. అయితే ఆమె పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను, అమిత్ షాను మాత్రమే కలిసే అవకాశముంది.
Next Story

