Fri Dec 05 2025 21:50:35 GMT+0000 (Coordinated Universal Time)
తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన
ఏపీ, తెలంగాణకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. ఏపీలో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం..

అమరావతి : ఏపీ, తెలంగాణకు వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. ఏపీలో రెండ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలో నేడు, రేపు తేలికపాటి వానలు కురుస్తాయని తెలిపింది. ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో కొన్నిచోట్ల స్వల్పస్థాయిలో వర్షం కురుస్తుందని, రాయలసీమలో ఇవాళ ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షం కురుస్తుందని వివరించింది.
అలాగే.. తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని, ఉరుములు - మెరుపులతో పాటు గరిష్ఠంగా 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. తెలుగు రాష్ట్రాలకు వర్షసూచనతో.. మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు వేడి నుంచి కాస్త ఉపశమనం లభించనుంది.
Next Story

