Tue Jan 20 2026 11:19:41 GMT+0000 (Coordinated Universal Time)
నేడు, రేపు ఏపీలోని ఈ జిల్లాల్లో అతిభారీ వర్షాలు
నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు

నేడు పశ్చిమమధ్య, వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీని ప్రభావంతో నేడు, రేపు కోస్తాంధ్రలో పలుచోట్ల అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇవాళ పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తం చేశారు. గంటకు 40 -50 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందని.. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా లోతట్టు ప్రాంతప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story

