Sun Mar 15 2026 19:49:47 GMT+0530 (India Standard Time)
విశాఖ రైల్వే జోన్ పై కేంద్ర మంత్రి హామీ
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కార్యాలయం కార్యకలాపాలను ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ కార్యాలయం కార్యకలాపాలను ప్రారంభిస్తామని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రైల్వే మంత్రిని వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి కలసి విశాఖ రైల్వే జోన్ పై ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఇటీవల కొత్త జోన్ ల ఆలోచన లేదని పార్లమెంటులో మంత్రి చెప్పడంతో ఆయనను ప్రత్యేకంగా వైసీపీ ఎంపీలు కలిశారు.
త్వరలోనే ప్రారంభిస్తామని....
గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎంపీలు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ దృష్టికి తెచ్చారు. పరిశీలించిన ఆయన వెంటనే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు.
Next Story

