Sun Dec 14 2025 19:31:27 GMT+0000 (Coordinated Universal Time)
జడ్జీలే ఎన్నికల్లో పోటీ చేస్తే పోలా?
న్యాయవ్యవస్థ పై రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు

న్యాయవ్యవస్థ పై రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష నేత వ్యవస్థలను మ్యానేజ్ చేస్తున్నారని వైసీపీ ఎమ్మెల్యే కోడుమూరు శ్రీనివాసులు అన్నారు. నిన్న హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. వ్యవస్థలను మేనేజ్ చేయడం ద్వారా ప్రభుత్వాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారన్నారు.
అభివృద్ధిని అడ్డుకుని....
అభివృద్ధిని అడ్డుకుని వచ్చే ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారని శ్రీనివాసులు ఆరోపించారు. శాసనసభకు చట్టాలు చేసే అధికారం లేదని చెప్పడం సరికాదన్నారరు. జడ్జీలే ఎన్నికల్లో పోటీ చేసి పరిపాలన చేస్తే సరిపోతుందన్నారు. న్యాయవ్యవస్థ దిగజారి పోతుందనడానికి నిన్నటి తీర్పు ఉదాహరణ అని ఎమ్మెల్యే శ్రీనివాసులు వ్యాఖ్యానించారు.
- Tags
- srinivasulu
- mla
Next Story

