Wed Jan 21 2026 03:54:24 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీకి రాహుల్ భారత్ జోడో యాత్ర
ఈరోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించనుంది.

ఈరోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఆంధ్రప్రదేశ్ లోకి ప్రవేశించనుంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలలోని డి. హరేహళ్ లో రాహుల్ యాత్ర మధ్యాహ్నానికి ప్రవేశించనుంది. ఇప్పటికే దాదాపు వెయ్యి కిలోమీటర్లకు దగ్గరగా రాహుల్ గాంధీ పాదయాత్ర చేరుకుంది.ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజులు పర్యటించిన తర్వాత తిరిగి యాత్ర కర్ణాటకకు వెళుతుంది.
భారీ స్వాగతం...
రాహుల్ గాంధీ జోడో పాదయాత్రకు స్వాగతం పలికేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు అన్నమయ్య జిల్లాలో ఎదురు చూస్తున్నారు. ప్రతిరోజూ 6.30 గంటలకు బయలుదేరి పదిన్నర గంటలకు విరామాన్ని తీసుకుంటున్నారు. భోజనం అక్కడే చేస్తారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు బయలుదేరి 7.30 వరకూ జోడో యాత్ర కొనసాగుతుంది. రాహుల్ జోడో యాత్రకు విశేష స్పందన కనిపిస్తుంది.
Next Story

