Sun Feb 01 2026 22:30:19 GMT+0000 (Coordinated Universal Time)
జస్టిస్ చంద్రుపై ఫిర్యాదు చేసిన రఘురామ
ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తన లేఖను సుమోటాగా తీసుకుని విచారణ జరిపించాలని కోరారు.

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ రాశారు. తన లేఖను సుమోటాగా తీసుకుని విచారణ జరిపించాలని కోరారు. మద్రాస్ హైకోర్టు మాజీ జస్టిస్ చంద్రు చేసిన వ్యాఖ్యలపై రఘురామ కృష్ణరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థను కించపర్చేలా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వానికి, న్యాయవ్యవస్థకు మధ్య ఉన్న అంతరాన్ని ఆయన ప్రశ్నించారన్నారు.
సుమోటాగా తీసుకుని....
జస్టిస్ చంద్రు వ్యాఖ్యలు న్యాయవ్యవస్థను కించపర్చేలా ఉన్నాయని రఘురామ కృష్ణరాజు తన లేఖలో పేర్కొన్నారు. తన లేఖను సుమోటాగా తీసుకుని దీనిపై విచారణ చేయాలని ఆయన లేఖలో చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను కోరారు. ఈ సందర్భంగా జస్టిస్ చంద్రు హిందూ దినపత్రికలో రాసిన వ్యాసాన్ని కూడా జత చేశారు.
Next Story

