Sat Dec 13 2025 22:33:23 GMT+0000 (Coordinated Universal Time)
Raghu Rama Krishna Raju : రఘురామ విసిగెత్తిపోయారా? అందుకే కీలక నిర్ణయం తీసుకున్నారా?
డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే పదవి పట్ల సంతృప్తిగా లేరు

డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు ఎమ్మెల్యే పదవి పట్ల సంతృప్తిగా లేరు. ఆయన చూపంతా హస్తినపైనే ఉంది. గత ఎన్నికల సమయంలో రఘురామ కృష్ణరాజు నరసాపురం పార్లమెంటు టిక్కెట్ కోసం చివర వరకూ ప్రయత్నించారు. అయితే అది బీజేపీ కోటాలోకి వెళ్లిపోవడంతో ఆయనకు ఎక్కడో ఒకచోట స్థానం కల్పించాలన్న ఉద్దేశ్యంతో ఉండి శాసనసభ నుంచి టీడీపీ పోటీ చేయించింది. గెలిచిన తర్వాత డిప్యూటీ స్పీకర్ పదవిని అప్పగించింది. కేబినెట్ ర్యాంకు పదవి అయినప్పటికీ ఆయన మనసంతా ఢిల్లీపైనే ఉంది. వచ్చే ఎన్నికల నాటికి తాను పార్లమెంటు నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని ఆయన భావిస్తున్నట్లే కనపడుతుంది. ఆయన తన సన్నిహితుల వద్ద చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇలాగే ఉంటున్నాయి.
ఉండి పై నిరాసక్తి...
అయితే అప్పటికే ఉండి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మంతెన రామరాజు ను ఒప్పించి రఘురామ కృష్ణరాజుకు టీడీపీ నాయకత్వం ఆ సీటును కేటాయించింది. మంతెన రామరాజుకు నామినేటెడ్ పోస్టు ఇచ్చింది. ఆయనను ఏపీఐఐసీ ఛైర్మన్ గా నియమించింది. అయితే అక్కడ జనసేన లో కూడా కొంత అసంతృప్తి కనపడుతుంది. ఉండి నియోజకవర్గం తమకు కావాలని గత ఎన్నికల్లోనే జనసేన గట్టిగా పోరాడింది. అయితే రఘురామ కృష్ణరాజు కోసమే కాకుండా,టీడీపీ సిట్టింగ్ సీటు కావడంతో జనసేకు ఇవ్వలేదు. ఉండి జనసేన ఇన్ ఛార్జి నాగరాజుకు ఇప్పటి వరకూ ఎలాంటి పదవి దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారని సమాచారం. నాగరాజు శెట్టి బలిజ సామాజికవర్గం నేత కావడంతో ఆయన తన అసంతృప్తిని సన్నిహితుల ముందు వెళ్లగక్కుతున్నారట.
దానిపైనే మక్కువ...
మరొకవైపు డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు మాత్రం వచ్చే ఎన్నికల్లో ఉండి నుంచి పోటీ చేయడానికి పెద్దగా ఇష్టపడటం లేదు. రఘురామ కృష్ణరాజుకు రాష్ట్ర రాజకీయాల కంటే ఢిల్లీలో ఉండటమే ఎక్కువగా ఇష్టపడతారు. ఆయన ఈసారి గట్టిగా తనకు టిక్కెట్ కావాలని పట్టుబడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి ఇప్పటి నుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని తెలిసింది. ప్రస్తుతం నరసాపురం ఎంపీగా ఉన్న శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రిగా కూడా ఉన్నారు. అయితే ఆయనను తప్పించి రఘురామ కృష్ణరాజుకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ ఇస్తారా? అన్నది సందేహమే అయినప్పటికీ ఈసారి టీడీపీ కోటాలో నరసాపురం తనకు కేటాయించాలని రఘురామ కృష్ణరాజు పట్టుబట్టే అవకాశముందంటున్నారు.
Next Story

