Sat Mar 07 2026 21:57:51 GMT+0530 (India Standard Time)
రేపు రఘురామ రాజీనామా?
ఫిబ్రవరి 7, 8 తేదీల్లో రఘురామ కృష్ణరాజు రాజీనామా చేస్తారని ఢిల్లీ నుంచి ఆయన సన్నిహితులు చెబుతున్నారు

వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఫిబ్రవరి 5వ తేదీ వరకూ ఆయన టైం పెట్టుకున్నారు. తనపై ఫిబ్రవరి 5వ తేదీలోగా అనర్హత వేటు వేయించాలని వైసీపీ నేతలకు ఆయన సవాల్ విసిరారు. ఫిబ్రవరి ఐదో తేదీ ముగిసింది. ఆయన రాజీనామాకు రెడీ అయిపోయినట్లు తెలిసింది.
సోమవారమే....
ఫిబ్రవరి 7, 8 తేదీల్లో రఘురామ కృష్ణరాజు రాజీనామా చేస్తారని ఢిల్లీ నుంచి ఆయన సన్నిహితులు చెబుతున్నారు. బహుశ సోమవారం రఘురామ కృష్ణరాజు రాజీనామా చేసే అవకాశాలున్నాయని చెబుతున్నారు. పార్లమెంటు సమావేశాలకు హాజరయిన తర్వాత రేపు ఆయన రాజీనామా చేస్తారని చెబుతున్నారు. మరి రఘురామ కృష్ణరాజు రాజీనామా చేస్తారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story

