Sat Jan 31 2026 18:51:25 GMT+0000 (Coordinated Universal Time)
ఆ ప్రచారాన్ని నమ్మవద్దు
వంగవీటి రాధా పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో నిజం లేదని రాధాయువసేన తెలిపింది

వంగవీటి రాధా పార్టీ మారుతున్నారన్న ప్రచారంలో నిజం లేదని రాధాయువసేన తెలిపింది. అలాంటి ప్రచారాలు చేస్తూ రాధా ప్రతిష్టను మసకబర్చాలని కొందరు ప్రయత్నిస్తున్నారని వారు అన్నారు. ఈ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని రాధా యువసేన తరుపున రంగా అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
టీడీపీలోనే...
వంగవీటి రాధా ప్రస్తుతం టీడీపీలో ఉన్నారని, టీడీపీలోనే కొనసాగుతారని రాధా యువసేన తెలిపింది. అవసరాల కోసం పార్టీ మార్చే నైజం రాధాది కాదని పేర్కొంది. స్వచ్ఛమైన రాజకీయాలు నడపటమే రాధా లక్ష్యమని తెలిపింది. కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతో రాధా ప్రతిష్ట మంట కలిపే వారి ప్రయత్నాలు ఎప్పటికీ ఫలించవని పేర్కొన్నారు. వంగవీటి రాధాపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని వంటవీటి అభిమానులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని రాధా యువసేన తెలిపింది.
Next Story

