Tue Mar 31 2026 10:53:47 GMT+0530 (India Standard Time)
"రాగిజావ".. రెండోసారీ వాయిదా !
విద్యార్థుల కోసం ఈ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడంలో భాగంగా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించాలనుకున్న రాగిజావ పథకం రెండోసారి కూడా వాయిదా పడింది. విద్యార్థుల కోసం ఈ రాగిజావ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించిన విషయం తెలిసిందే. అనుకున్న తేదీ ప్రకారం.. మార్చి 2వ తేదీ నుంచే ఈ పథకాన్ని ప్రారంభించాల్సి ఉంది. కానీ మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.
మార్చి 9న అనగా నిన్న.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే రాగి జావను ఎలా తయారు చేయాలి? అందుకు కావాల్సిన వస్తువులేంటి? రేషన్ షాపు వద్ద వాటిని ఎలా తీసుకోవాలి అన్న వివరాలను బుధవారం విద్యాశాఖ విడుదల చేసింది. కానీ మళ్లీ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసింది. మార్చి 21కి రాగిజావ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు జిల్లా అధికారులకు తెలిపింది. మార్చి 21 నుండైనా ఈ కార్యక్రమం మొదలవుతుందో.. లేక మళ్లీ వేసవి సెలవుల తర్వాత ప్రారంభిస్తారో చూడాలి.
Next Story

