Sun Mar 15 2026 08:57:59 GMT+0530 (India Standard Time)
Breaking : రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా
రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ను ఆమోదించారు.

రాజ్యసభ సభ్యత్వానికి ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. కృష్ణయ్య రాజీనామాను రాజ్యసభ ఛైర్మన్ ను ఆమోదించారు. గత వైసీపీ ప్రభుత్వం రాజ్యసభ సభ్యుడిగా తెలంగాణకు చెందిన బీసీ నేత ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు ఎంపిక చేశారు. ఎన్నికలల్లోనూ వైసీపీని గెలిపించాలని ఆర్ కృష్ణయ్య రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు.
వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో...
ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారాన్ని కోల్పోవడంతో ఆర్ కృష్ణయ్య పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఆయన బీజేపీలో చేరతారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో ఈ పదవి కూడా ఏపీలో కూటమి ఖాతాలో పడనుంది.
Next Story

