Tue Mar 17 2026 07:31:29 GMT+0530 (India Standard Time)
YSRCP : పార్టీని వీడనని చెబుతున్న మరో ఎమ్మెల్యే
వైసీపీ తన కుటుంబమని తాను జగన్ తోనే ఉంటానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు

వైసీపీ తన కుటుంబమని తాను జగన్ తోనే ఉంటానని పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబు తెలిపారు. తాను పార్టీ మారతానని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని చెప్పారు. నియోజకవర్గాల ఇన్ఛార్జులను మార్చిన తర్వాత కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా ఎమ్మెల్యేలు తాము జగన్ వెంటనే నిలుస్తామని చెబుతున్నారు. నిన్న మడకశిర ఎమ్మెల్యే తిప్పేస్వామి తాను వైసీపీలో కొనసాగుతానని చెప్పగా, నేడు పూతలపట్టు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే కూడా తాను పార్టీ వీడనని చెప్పారు.
పార్టీలోనే ఉంటా...
పూతలపట్టు నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో గెలిచిన ఎంఎస్ బాబును తప్పించి కొత్తవారికి అధినాయకత్వం ఇన్ఛార్జిగా నియమించింది. తొలినాళ్లలో ఎంఎస్ బాబు కొంత అసంతృప్తి వ్యక్తం చేసినా తర్వాత మాత్రం మౌనంగానే ఉండిపోయారు. ఇప్పుడు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ తన ప్రయాణం వైసీపీతోనేనని ఆయన తేల్చిచెప్పారు.
Next Story

