Fri Mar 20 2026 20:24:56 GMT+0530 (India Standard Time)
TDP : జగన్ చెప్పిన వాళ్లనే గెలిపించండి : బీటెక్ రవి
రాష్ట్రంలో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే జగన్ అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీ టెక్ రవి అన్నారు

రాష్ట్రంలో ఉండే పెత్తందారులకు ప్రతినిధిగా ఉన్నదే జగన్ అని పులివెందుల టీడీపీ అభ్యర్థి బీ టెక్ రవి అన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో జగన్ తన ఆస్తి దాదాపు రూ.750 కోట్లు చూపెట్టారన్నారు. ఆయనపై పోటీ చేస్తున్న తన అఫిడవిట్ లో ఆస్తి కేవలం ఎనభై లక్షలు మాత్రమేనని బీటెక్ రావి తెలిపారు. అఫిడవిట్ ను చూసైనా పేదవాడెవరు, పెత్తందారు ఎవరో ప్రజలు తెలుసుకోవాలని ఆయనకోరారు.
అఫడవిట్ లో చెప్పినట్లే...
ఎన్నికల అఫిడవిట్ చూసి జగన్ చెప్పినట్లే పేదవాడిని గెలిపించండి అని బీటెక్ రవి కోరారు. ఆఖరికి ఆయన చెల్లెళ్ల చీరల రంగుపైనా మాట్లాడుతున్నారంటే ఏమనాలి? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్ కు వ్యతిరేకులైన వారితో మద్దతుగా ఉంటారా అని జగన్ విమర్శించారని, ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ ఆలోచించి మాట్లాడాలని కోరుతున్నానని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు.
Next Story

